![]() |
![]() |

ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున వంటి అగ్ర కథానాయకులతో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే... యువ కథానాయకులతో కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు మ్యాట్ని ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ శ్రీకారం చుడుతోంది. గతంలో 'ఘాజీ', 'క్షణం' వంటి న్యూ ఏజ్ చిత్రాలను నిర్మించింది ఈ సంస్థే.
ప్రస్తుతం చిరుతో 'ఆచార్య', నాగార్జునతో 'వైల్డ్ డాగ్' చిత్రాలు నిర్మిస్తున్న మ్యాట్ని ఎంటర్టైన్మట్ సంస్థ... ఆ తరువాత శ్రీ విష్ణు కథానాయకుడిగా ఓ సినిమా నిర్మించనుంది. 'జోహార్' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల అభినందనలు అందుకున్న యువ దర్శకుడు తేజ మార్ని. అతడితో శ్రీ విష్ణు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దానిని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది.
గోదావరి నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రమిది అని సమాచారం. బడ్డీ కామెడీగా తెరకెక్కిస్తున్నారట. అంటే... కొంతమంది స్నేహితులు నేపథ్యంలో నడిచే వినోదాత్మక సన్నివేశాలు ఈ సినిమాలో ప్రధానం. డిసెంబర్ చివరి వారం వచ్చి చిత్రీకరణ ప్రారంభించి రెండు నెలల్లో సినిమాలు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |