![]() |
![]() |

యంగ్ హీరోయిన్ మెహారీన్ కౌర్ ఫిర్జాడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి మాల్దీవులు వెళ్లారు. అక్కడ సముద్ర తీరంలో సరదాగా తిరుగుతుండగా ఆమె కాలికి గాయమైంది. ఇసుకలో ఏదో ముల్లు లాంటిది పాదంలో గుచ్చుకుంది.
రిసార్ట్ సిబ్బంది మెహరీన్ కాలులో ముల్లును తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె సోదరుడు గుర్‌ఫతే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి ఇంజురీ నంబర్ 649275920 అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికి అన్నిసార్లు మెహరీన్ కి గాయాలు అయ్యాయని కామెంట్ చేశారు. తరచూ ఆమె గాయాల పాలవుతారని సరదాగా చెప్పారు అన్నమాట.




![]() |
![]() |