![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. తొలి ప్రయత్నంగా 'షూట్ అవుట్ ఎట్ ఆలేర్' వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నందిని రాయ్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ పోలీస్ అధికారుల పాత్రల్లో నటించారు.
చిరు కుమార్తె సుష్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా సుష్మితకి మెగా కాంపౌండ్ యంగ్ యాక్టర్లు బెస్ట్ విషెస్ చెప్పారు. నిర్మాతగా సుష్మిత చాలా కష్టపడిందని అన్నారు. ఎవరేం అన్నారంటే?
"ఆల్ ది బెస్ట్ హను అక్కా... నీకు అంతా మంచే జరగాలి. విజయం సాధించాలని కోరుకుంటున్నాను"
- సాయి తేజ్
"ఈ వెబ్ సిరీస్ కోసం నువ్వు, నీ టీమ్ ఎంత కష్టపడ్డారో తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్. త్వరగా వెబ్ సిరీస్ చూడాలని ఉంది"
- నిహారిక
"ఈ ప్రాజెక్ట్ మీద మీరు ఎంత కష్టపడి పని చేశారో నేను చూశా. ఇది సూపర్ హిట్ అవుతుంది. మీ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్"
- కల్యాణ్ దేవ్

![]() |
![]() |