Home  »  News  »  గుంటూరులో యువ హీరో హోటల్...

Updated : Nov 6, 2020

 

గుంటూరులో యువ హీరో ఆనంద్ దేవరకొండ ఒక హోటల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ అతడికి గుంటూరుకు దగ్గరలోని ఒక పల్లెలో హోటల్ ఉందట. అందులో బొంబాయి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందని దర్శకుడు వినోద్ అనంతోజు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. బొంబాయి చట్నీ చేయడంలో ఆనంద్ దేవరకొండ సిద్ధహస్తులని అంటున్నారు.

యంగ్ అండ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడే ఆనంద్ దేవరకొండ. 'దొరసాని' సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అంతకు ముందు అమెరికాలో మంచి జీతం వచ్చే ఉద్యోగం కూడా చేశాడు. అతనికి హోటల్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకుంటున్నారా?! ఓ సినిమా కోసం ఆయన ఆ హోటల్ ఓపెన్ చేశారు.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వినోద్ అనంతోజును దర్శకుడిగా పరిచయం చేస్తూ భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. అందులో గుంటూరుకు 20 కిలోమీటర్ల దూరంలోని కొలకలూరు‌ గ్రామానికి చెందిన రాఘవ పాత్రలో ఆనంద్ దేవరకొండ నటించారు. గుంటూరులో హోటల్ ఓపెన్ చేయాలనేది అతడి లక్ష్యం. ఈ సినిమా ఈ నెల 10న ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నారు. ఇందులో ఎ.ఇ. బాబు పాత్రలో తరుణ్ భాస్కర్ నటించారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.