![]() |
![]() |

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారినపడింది. ఈ సంగతి నిజమే. అయితే, ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టింది. తల్లితండ్రులకు కరోనా సోకినప్పుడు తమన్నా స్వయంగా సోషల్ మీడియాలో అందరికీ చెప్పుకొచ్చింది. బాధ్యతగా వ్యవహరించింది. కానీ, తనకు సోకినప్పుడు ఎందుకనో విషయం దాచింది. తన ఆరోగ్యం గురించి వార్తలు వస్తున్నప్పటికీ స్పందించడం లేదు.
కొన్ని రోజుల క్రితం తమన్నా హైదరాబాద్ వచ్చింది. ఒక జ్యువెలరీ షోరూమ్ వర్చువల్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. అంతేకాదు, ఒక వెబ్ సిరీస్ చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాల్లో ఉంది. ఈ సమయంలో జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. దాంతో ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం.
గోపీచంద్ 'సీటీమార్', సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం', నితిన్ 'అంధాధున్' సినిమాలు తమన్నా చేతిలో ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ కూడా ప్లానింగ్ లో ఉంది. ఇప్పుడు ఆమె కరోనా బారిన పడటంతో షూటింగులు వాయిదా పడే అవకాశం ఉంది.
![]() |
![]() |