![]() |
![]() |

టాలెంటెడ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యువ నటుడు కార్తికేయ ఒకే రకమైన పాత్రలతో సరిపెట్టకుండా, వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అజయ్ భూపతి డైరెక్షన్‌లో చేసిన 'ఆర్ఎక్స్ 100' మూవీలో చక్కని అభినయంతో అలరించాడు. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం అల్లు అరవింద్‌కు చెందిన జీఏ2 బ్యానర్‌లో 'చావు కబురు చల్లగా' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కార్తికేయ జోడీగా లావణ్యా త్రిపాఠి నటిస్తుండటం గమనార్హం.
దీని తర్వాత మరో రెండు ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు కార్తికేయ. వాటిలో ఒకటి తమిళ చిత్రం. అజిత్ హీరోగా నటిస్తోన్న 'వాలిమై' సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాడు. ఇదివరకే 'నానీస్ గ్యాంగ్ లీడర్'లో విలన్‌గా అతను మెప్పించడంతో 'వాలిమై' ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి కోలీవుడ్‌కు విలన్ రోల్‌తో అతను పరిచయం అవుతున్నాడు.
అలాగే మరో డెబ్యూ డైరెక్టర్ శ్రీ సారిపల్లితో అతను పనిచేయనున్నాడు. ఇందులో తాన్యా రవిచంద్రన్ అతనికి జోడీగా కనిపించనున్నది. విజయ్ సేతుపతి సినిమా 'కరుప్పన్'లో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఇలా ఆసక్తికర ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నాడు కార్తికేయ.
![]() |
![]() |