![]() |
![]() |

బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ జంటకు టైమ్‌లైస్ కపుల్ అనే పేరుంది. ఇద్దరిదీ ఢిల్లీ. 1988లో ఒక పార్టీలో కళ్లూ కళ్లూ కలిసి, తర్వాత హృదయంతో హృదయం మాట్లాడుకున్నాయి. భిన్న మతాలకు చెందిన ఆ ఇద్దరూ 1991 అక్టోబర్ 25న పెళ్లి చేసుకున్నారు. గౌరి చిబ్బెర్ కాస్తా గౌరీ ఖాన్‌గా మారిపోయింది. పెళ్లి చేసుకొనే సమయానికి షారుఖ్‌కు ఆర్థిక భద్రత లేదు. అయినా అతడిని ధైర్యంగా పెళ్లి చేసుకుంది గౌరి. ఇద్దరూ కోటి కలలతో ఢిల్లీ నుంచి బొంబాయికి వచ్చారు. అప్పట్నుంచీ ఇప్పటి దాకా షారుక్ జీవితానికి మూలస్తంభంలా నిల్చొంది గౌరి.
ఫ్యామిలీ పరంగా చూసుకుంటే షారుఖ్‌ది పేద కుటుంబం కాగా, గౌరి వాళ్లది మధ్యతరగతి కుటుంబం. పెళ్లి చేసుకోడానికి ముందు హానీమూన్‌కు పారిస్ తీసుకువెళ్లి ఈఫిల్ టవర్ చూపిస్తానని గౌరికి ప్రామిస్ చేశాడు షారుఖ్. అయితే అతడు అబద్ధం చెప్పాడని గౌరి అనుకోలేదు. అతడు నిజమే చెప్తున్నాడని అనుకుంది. అయితే పారిస్‌కు తీసుకెళ్లడానికి తగినంత ఆర్థిక స్థోమత అతడికి లేదు. అయినా ఆమె కన్విన్స్ అయ్యింది.
పెళ్లయిన మూడు నాలుగు వారాల తర్వాత హనీమూన్‌కు గౌరిని డార్జిలింగ్‌కు తీసుకువెళ్లాడు షారుఖ్. అయితే తాము పారిస్‌కు వెళ్తున్నామని ఆమెకు చెప్పాడు. గౌరికి అప్పటికి ఫారిన్ అంటే ఏమిటో తెలీదు. ఎప్పుడూ ఎక్కడికి వెళ్లిన మనిషి కాదు. నిజమేననుకొని అతడితో పాటు విమానం ఎక్కింది. అక్కడకు వెళ్లాక కానీ గౌరికి నిజం తెలీలేదు. అయితే ముంబై వచ్చిన తొలి రెండేళ్లూ తమకు హనీమూన్‌లాగే గడిచిందంటాడు షారుఖ్.

![]() |
![]() |