![]() |
![]() |

లాక్‌డౌన్‌లో కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్‌తో, మహారాష్ట్ర ప్రభుత్వంతో గొడవలతో నిత్యం వార్తల్లో నిలిచిన బ్రేవ్ లేడీ కంగనా రనౌత్ కెమెరా ముందుకు వచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యంత్రి దివంగత జె. జయలలిత బయోపిక్‌గా తయారవుతున్న 'తలైవి' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ సినిమా సెట్స్‌పై డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్‌తో సీన్ డిస్కషన్‌కు సంబంధించిన కొన్ని పిక్చర్లను సోమవారం పొద్దున్నే తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఆమె షేర్ చేశారు. ఆ పిక్చర్లలో కంగనకు విజయ్ సన్నివేశాన్ని వివరిస్తున్నాడు.
ఆ పిక్చర్లతో పాటు, "గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇవి ఎంతో ప్రతిభావంతుడైన, ప్రేమాస్పదుడైన డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్‌తో నిన్న ఉదయం సీన్ డిస్కషన్‌కు సంబంధించిన కొన్ని స్టిల్స్. ఈ ప్రపంచంలో అద్వితీయమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ నాకు మాత్రం ఓదార్పునూ, సౌకర్యాన్నీ ఇచ్చేది మాత్రం సినిమా సెట్టే. #Thalaivi" అని ఆమె పోస్ట్ చేశారు.

ఇటీవల తన స్వస్థలం మనాలీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ప్రసన్నబాబు ఆధ్వర్యంలో డాన్స్ రిహార్సల్స్‌కు సంబంధించిన పిక్చర్లను ఆమె షేర్ చేసి, "బ్యాక్ టు వర్క్" అని క్యాప్షన్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు 'తలైవి' షూటింగ్‌ను ఆమె పునఃప్రారంభించారు.

![]() |
![]() |