![]() |
![]() |

అమృతా సింగ్‌తో పదమూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆమెకు విడాకులిచ్చాడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్. పెళ్లి నాటికి ఆమె స్టార్ హీరోయిన్ అయితే, అతను ఓ బడ్డింగ్ యాక్టర్. అయినా ఆ ఇద్దరూ పిచ్చి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు.. సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్.. పుట్టిన కొంత కాలం తర్వాత ఇద్దరి మధ్యా పొరపొచ్చాలు వచ్చాయి. సైఫ్ కంటే అమృత 12 సంవత్సరాలు పెద్దది. పెళ్లినాటికి పెద్దగా తెలీలేదు కానీ, కాలం గడిచే కొద్దీ వయసు తేడా ఇద్దరి మధ్యా స్పష్టంగా కనిపిస్తూ వచ్చేది. ఏదేమైతేనేం పెళ్లైన పదమూడేళ్లకు 2004లో ఆ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత సుమారు ఎనిమిదేళ్లకు అంటే 2012లో కరీనా కపూర్‌ను ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు సైఫ్. అతని కంటే కరీనా పదేళ్లు చిన్నది. పెళ్లికి ముందు ఇద్దరూ ఐదేళ్లు కలిసి తిరిగారు. అయితే అమృత, కరీనా మధ్య మరో స్త్రీ కూడా సైఫ్ జీవితంలో కొంతకాలం ఉంది. ఆమె పేరు రోసా. ఆమె ఇటాలియన్ డాన్సర్, మోడల్. అమృతా సింగ్‌తో విడిపోక ముందే రోసాతో అతను ప్రేమలో పడ్డాడు. అమృతకు విడాకులిచ్చాక రోసాతో తన అనుబంధం గురించి బహిరంగంగా ప్రకటించాడు సైఫ్. తాము లివ్-ఇన్-రిలేషన్‌షిప్‌లో ఉన్నామని చెప్పాడు.
అయితే ఆ ఇద్దరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. సైలెంట్‌గా సైఫ్ లైఫ్ నుంచి తప్పుకుంది రోసా. విడాకుల సమయంలో సైఫ్ నుంచి భారీ స్థాయిలో భరణం పొందే దాకా అమృత పట్టు విడువలేదు. రోసాతో ఆ ఇబ్బందిని ఎదుర్కోలేదు సైఫ్. ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ కాకపోవడం కూడా అతడికి కలిసి వచ్చిందనుకోవాలి. అలా రోసాతో షార్ట్ టర్మ్ రిలేషన్‌షిప్ ముగిసింది. ఇప్పుడు కరీనాతో సైఫ్ హ్యాపీగా కాలం గడిపేస్తున్నాడు.

![]() |
![]() |