Home  »  News  »  'లెవెన్త్‌ అవర్‌'తో యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుంటానంటున్న మిల్కీ బ్యూటీ!

Updated : Nov 9, 2020

 

మిల్కీ బ్యూటీ తమన్నా డిజిట‌ల్ వ‌ర‌ల్డ్‌లో అడుగు పెడుతున్నారు. ఆమె ప్ర‌ధాన పాత్ర‌ధారిగా లెవెన్త్ అవ‌ర్ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. చంద‌మామ క‌థ‌లు, గుంటూర్ టాకీస్‌, పీఎస్‌వీ గ‌రుడ‌వేగ లాంటి సినిమాల‌తో ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడిగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన ప్ర‌వీణ్ స‌త్తారు దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌దీప్ నిర్మిస్తున్నారు.

మిల్కీ బ్యూటీ తమన్నా మాట్లాడుతూ - "అరవింద్‌గారి సినిమాల వల్ల నేను యాక్టర్‌ నుండి స్టార్‌ అయ్యాను. ఇప్పుడు చేస్తున్న 'లెవెన్త్‌ అవర్‌' సిరీస్‌ వల్ల ఓ స్టార్‌ నుండి మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటానని భావిస్తున్నాను. ఓ యాక్టర్‌గా నేను తెలుగు సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. తెలుగు కంటెంట్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇక 'లెవన్త్‌ అవర్' విషయానికి వస్తే.. చాలా మంచి పొటెన్షియల్‌ ఉన్నస్క్రిప్ట్‌‌. లాక్‌డౌన్‌లో నేను విన్న మొదటి స్క్ర్రిప్ట్‌ . ప్రదీప్‌గారులాంటి నిర్మాతలను చాలా తక్కువగా చూస్తాం. మంచి నాలెడ్జ్‌ ఉన్న వ్యక్తే కాదు.. చాలా మంచి వ్యక్తి కూడా. ఈ వెబ్‌సిరీస్‌  షూటింగ్‌ సమయంలో నాకు కరోనా సోకితే చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంజాయ్‌ చేశాను. ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను. ఇలాంటి విపత్కర సమయంలో పనిచేయడం చాలా కష్టం. అయినా కూడా కోవిడ్‌ రూల్స్ ఫాలో చేస్తూ షూటింగ్స్‌ చేస్తున్నారు" అన్నారు.

రైటర్‌, నిర్మాత ప్రదీప్‌ మాట్లాడుతూ "ప్రవీణ్‌ సత్తారు, తమన్నా, అరవింద్‌గారు ఇలా ఓ మంచి టీమ్‌తో కలిసి పనిచేయడాన్ని ఎంజాయ్‌ చేశాను. ఈ వెబ్‌ సిరీస్‌ కథను '8 అవర్స్‌' అనే బుక్‌నుండి రైట్స్ కొని తయారు చేసుకున్నాను" అన్నారు.

ఏస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ మాట్లాడుతూ - "ప్రదీప్‌గారు ఓ రోజు ఓకథను తీసుకొచ్చి వినిపించారు. కథ నాకు బాగా నచ్చింది. కొన్ని గంటల్లో నడిచే కథ. దర్శకుడు ఎవరో అప్పటికింకా అనుకోలేదు. ఒక మంచి స్టార్‌, దర్శకుడు కలిస్తేనే ఈ సిరీస్‌ను పెద్దదిగా చేయగలం అనిపించింది. అప్పుడు మా టీమ్‌ సభ్యులు తమన్నా పేరుని సూచించారు. తమన్నా మా గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో ఇది వరకు హీరోయిన్‌గా సినిమాలు చేశారు. ఆ నమ్మకంతో ఆమెను సంప్రదించాం. ఆమె ఒప్పుకున్నారు. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు విషయానికి వస్తే.. తను ఓ విలక్షణ దర్శకుడు. తను ఏ సినిమా చేసినా ఆ జోనర్‌కు తగ్గట్టు చక్కగా సినిమాను తెరకెక్కించగలడు. ఏ సినిమాను పడితే ఆ సినిమాను చేయాలని అనుకోడు. కథ విని నచ్చితేనే చేస్తాడు. తను ఈ సబ్జెక్ట్‌ విని బావుందని అన్నారు. ప్రదీప్‌గారు నిర్మాతే కాదు.. అద్భుతమైన రైటర్‌ కూడా. అందుకనే మా కోసం ఆయన్ని మరో వెబ్‌సిరీస్‌ చేయమని అడిగాను. ఇక ఈ వెబ్‌సిరీస్‌ టైటిల్‌ను పెట్టడానికి చాలా ఆలోచించాం. చివరగా కొన్ని మాటల సందర్భంలో టైటిల్‌ను 'లెవన్త్‌ అవర్‌' అని ఖరారు చేశాం" అన్నారు.

డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ "అరవింద్‌గారికి ఓ స్క్రిప్ట్‌ వినిపించాను. అది ఆయనకు బాగా నచ్చింది. దాన్ని డెవలప్‌ చేస్తున్న తరుణంలో ఓ కథ ఉంది. నువ్వు నీ కథలనే డైరెక్ట్‌ చేస్తావా లేక.. వేరే వాళ్లు రాసిన కథనైనా డైరెక్ట్‌ చేస్తావా? అని ఓరోజు అరవింద్‌గారు అడిగారు. కథ బావుంటే ఎవరు రాసిన కథనైనా డైరెక్ట్‌ చేస్తానని అన్నాను. తర్వాత ప్రదీప్‌గారు రాసిన స్క్రీన్‌ప్లే ఇచ్చారు. అది చదివిన తర్వాత ప్రదీప్‌గారు నిర్మాతే కాదు.. న్యూ ఏజ్‌ రైటర్‌ కూడా అని అర్థమైంది.  ఓ సిరీస్‌కు ఉండాల్సిన అన్నీ అంశాలు ఈ 'లెవన్త్‌ అవర్‌'లో ఉన్నాయి. ఓ నెల తర్వాత షూటింగ్‌ స్టార్ట్ చేశాను. తమన్నాగారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 రోజుల పాటు రాత్రి సమయంలోనే సినిమాను షూట్‌ చేశాం. తను బాగా సపోర్ట్‌ చేసింది. టైటిల్‌తోనే అసలు మేం ఎలాంటి కంటెంట్‌ను చూపించబోతున్నామో అర్థం చేసుకోవచ్చు. ఒక రాత్రిలో జరిగే కథ. అందులో తమన్నా పాత్ర, ఓ కంపెనీని ఎలా సేవ్‌ చేసిందనేదే కథ. పురుషాధిక్యత ప్రపంచంలో ఓ అమ్మాయి తన కలలను ఎలా నిజం చేసుకుందనేదే కథ. హ్యుమన్‌ రిలేషన్స్‌, ఎమోషన్స్‌ గురించి ఇందులో మాట్లాడాం. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్‌ ప్రపంచంలో మహిళలు ఎలా ఉన్నారనే విషయాన్ని టచ్‌ చేశాం. ఓ బోర్డ్‌ రూమ్‌లో రాత్రి వేళలో జరిగే కథ కాబట్టి ఇందులో పరిగెత్తడాలు, గన్‌ఫైట్స్‌, ఛేజింగ్‌లుండవు. ఓ పర్టిక్యులర్‌ ఏరియాలో షూటింగ్‌ చేయడమంటే చాలా ఛాలెంజ్‌తో కూడుకున్నది. కానీ కెమెరామెన్‌ ముఖేష్‌ సాయంతో చాలా బాగా పూర్తి చేయగలిగాం. తమన్నా తన భుజాలతో సిరీస్‌ను క్యారీ చేసింది. ఈ సిరీస్‌కు సీజన్‌ 2 ఉంటుందనేలా ఎండింగ్‌ ఇచ్చాం. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి" అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.