![]() |
![]() |

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ ఒక సమయంలో వరుస విజయాలు అందుకున్నాడు. ఆ తరవాత పరాజయాలు పలకరించాయి. కథల ఎంపికలో లోపమో? లేదంటే మరో కారణమో? హీరోగా సునీల్ కెరీర్ గాడి తప్పింది. దాంతో మళ్ళీ కమెడియన్ అవతారం ఎత్తారు. కామెడీ టచ్ ఉన్న విలన్ క్యారెక్టర్లు కూడా చేశారు. ప్రస్తుతం సునీల్ కెరీర్ బాగుందని చెప్పాలి. అవకాశాలకు కొదవ లేదు. ఈ సమయంలో మళ్లీ హీరోగా మారుతున్నారు.
కన్నడలో గతేడాది విజయం సాధించిన సినిమాల్లో 'బెల్ బాటమ్' ఒకటి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావాలని కలలు కనే ఓ కానిస్టేబుల్ కథతో ఆ సినిమా తెరకెక్కింది. అందులో కామెడీకి మంచి స్కోప్ ఉంది. ఆ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ కన్నడ హీరో రక్షిత్ శెట్టి దక్కించుకున్నాడు. తెలుగులో అతడే ప్రొడ్యూస్ చేయనున్నాడు. 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాతో ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు 'బెల్ బాటమ్' తెలుగు రీమేక్ లో హీరోగా సునీల్ ని తీసుకున్నారు.
'బెల్ బాటమ్' కథ సునీల్ బాడీ లాంగ్వేజ్ కి బాగా సూట్ అవుతుంది అని రక్షిత్ శెట్టి భావించాడట. తెలుగు రీమేక్ కోసం దర్శకుడు ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఈ టైమ్ లో సునీల్ హీరోగా మారడం రిస్క్ కాదుగా!?
![]() |
![]() |