![]() |
![]() |

'బాహుబలి' సిరీస్‌తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు యస్.యస్. రాజమౌళి. అయినప్పటికీ తనలోని దర్శకుడి కన్నా కథకుడే గొప్పవాడని ఆయన చెప్పారు. కొంతకాలం క్రితం మంగుళూరులో ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, "కథ చెప్పడం, క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా వివరించడంలో నేను చాలా బెస్ట్. నాలో ఉన్న దర్శకుడి కన్నా కథకుడే బాగా నచ్చుతాడు. నా హీరోలకు కూడా నాలో అదే నచ్చుతుంది" అని ఆయన చెప్పారు.
బాలరామాయణం, అమర చిత్రకథ లాంటి కామిక్ పుస్తకాలు చదువుతూ పెరిగిన ఆయనకు పురాణాల మీద మంచి పట్టుంది. "అవి చిన్నప్పటి నుంచే నా బ్లడ్‌లో ఉన్నాయి. కర్ణుడి వల్లే నాకు మహాభారతం అంటే ఇష్టం. అతని గురించి చదువుతున్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భావోద్వేగానికి గురైతే కన్నీరు అస్సలు ఆగదు" అని అన్నారు రాజమౌళి. ఒక సినిమా సక్సెస్ క్రెడిట్ 80 శాతం కథకు, 20 శాతం సినిమాటోగ్రఫీకి ఇస్తానని ఆయన తెలిపారు.
![]() |
![]() |