![]() |
![]() |

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత మరో యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' తరహాలోనే ఇందులో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారు. అందులో ఒక పాత్ర అఘోరా అని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇందులో బాలయ్య సరసన నటించబోయే కథానాయికలెవరో ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో.. పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో పేరు చేరింది. అదే.. ప్రగ్యా జైస్వాల్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కంచె' చిత్రంతో గుర్తింపు పొందిన ప్రగ్యా.. ఆపై పలు చిత్రాల్లో సందడి చేశారు. కింగ్ నాగార్జున సరసన కూడా 'ఓం వేంకటేశాయ' కోసం ఆడిపాడారు. త్వరలోనే 'BB3'లో ప్రగ్యా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. అలాగే మరో కీలక పాత్రలో నటి పూర్ణ కూడా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ వెంచర్ కి తమన్ బాణీలందిస్తున్నారు.

![]() |
![]() |