![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ఆదివారం ఉదయం హాలిడే ట్రిప్ కి వెళ్లారు. ఎక్కడికి వెళ్తున్నామనేది వాళ్ళు చెప్పలేదు. కానీ, సముద్ర తీరంలో ఉన్న ఓ నగరానికి వెళ్లినట్టు తాజా ఫొటోలు చూస్తే అర్థం అవుతోంది.
ఎయిర్ పోర్టులో మాస్కులు ధరించిన మహేష్ ఫొటోలు ఆదివారం నెట్టింట సందడి చేశాయి. సూపర్ స్టార్ ఫేస్ కనిపించలేదు. కానీ, ఆయన కొత్త హెయిర్ స్టయిల్ అభిమానులను ఆకట్టుకుంది. వాళ్లకు అమితంగా నచ్చింది. అయితే... మహేష్ కుమార్తె సితార ఓ ఆసక్తికరమైన ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఫ్లైట్ జర్నీలో నమ్రత నిద్రపోతున్న సమయంలో సితార ఫొటో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. "సాధారణంగా మా అమ్మ ఎప్పుడూ నిద్రపోదు. ఒకవేళ నిద్ర పోయిందో... తను నా ఏంజిల్" అని సితార పేర్కొంది.


![]() |
![]() |