![]() |
![]() |

నటుడు, హీరో కావడానికి ముందు రానా దగ్గుబాటి ఓ నిర్మాత. అతడిలో మంచి వ్యాపారవేత్త ఉన్నాడు. గతంలో యానిమేషన్ కంపెనీ నిర్వహించిన అనుభవం ఉంది. తాతయ్య దగ్గుబాటి రామానాయుడు, తండ్రి సురేష్ బాబు ప్రముఖ నిర్మాతలు కావడంతో వారసత్వంగా నిర్మాణ లక్షణాలు వచ్చాయేమో! కొన్ని చిత్రాల నిర్మాణంలో భాగమయ్యారు. ఇప్పుడు మరో కొత్త వ్యాపారానికి రానా శ్రీకారం చుట్టారు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు.
'సౌత్ బే' పేరుతో రానా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. పది సెకన్ల నుండి పది గంటల నిడివి కల కథలను అందులో చెప్పనున్నారు. న్యూస్, మ్యూజిక్, యానిమేషన్, ఫిక్షన్ కథలు మొదలుకుని ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా సినీ సెలబ్రిటీలు మాట్లాడుకునే కంటెంట్ వరకు సౌత్ బే ఛానల్ లో ఎన్నో అందుబాటులోకి తీసుకు రానున్నారు. రానాకు బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి చానల్ కి వ్యూస్ రావడం పెద్ద కష్టమేమి కాదు. లాక్ డౌన్ లో రానా మదిలో ఈ చానల్ ఐడియా పురుడు పోసుకుంది.

![]() |
![]() |