![]() |
![]() |

లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన 232వ చిత్రం తాలూకు టైటిల్ టీజర్ ని రిలీజ్ చేశారు. 'విక్రమ్' పేరుతో రానున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో కనిపించారు కమల్. 'ఖైదీ' ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న 'విక్రమ్' 2021 వేసవిలో సందడి చేయనుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సరిగ్గా 35 ఏళ్ళ క్రితం అంటే 1986లో 'విక్రమ్' అనే ఓ తమిళ చిత్రంలో నటించారు కమల్. ఆ సినిమా కూడా వేసవిలోనే (మే 29) విడుదలై విజయం సాధించింది. మరి.. నాటి 'విక్రమ్'ని మించి నేటి 'విక్రమ్' విజయం సాధిస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న కమల్ 'ఇండియన్ 2'కి కూడా అనిరుధే స్వరకర్త కావడం గమనార్హం.
![]() |
![]() |