![]() |
![]() |

పూజా హెగ్డేకి స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిందంటే కారణం తెలుగు సినిమా ఇండస్ట్రీయే. తమిళంలో 'ముగమూడి' అనే ఫ్లాప్ సినిమా చేయడంతో రెండేళ్ళు సినిమా అవకాశాలు లేకుండా పోయిన ఆమెకు ‘ఒక లైలా కోసం’, ‘ముకుందా’లో అవకాశం ఇచ్చింది టాలీవుడ్డే. ఆ తర్వాత హిందీ సినిమా ‘మొహెంజదారో’ మోజులో రెండేళ్ళు తెలుగు సినిమాలకు దూరమైనా... మళ్ళీ టాలీవుడ్ ఆదరించింది. మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ పక్కన నటించే అవకాశాలు ఇచ్చింది. అటువంటి టాలీవుడ్‌ని తాజా ఇంటర్వ్యూలో పూజా హెగ్డే తక్కువ చేసి మాట్లాడింది.
‘‘సౌత్‌లో జనాలు నడుము మత్తులో ఉంటారు. హీరోయిన్లను మిడ్ డ్రస్‌లలో చూడాలని అనుకుంటారు’’ అని ఒక యూట్యూబ్, వెబ్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చెప్పారు. అంతే కాదు... అదేదో జోక్ అన్నట్టు నవ్వారు. సౌత్ అంటే టాలీవుడ్ అని అనుకోవాలి. ఎందుకంటే... హీరోయిన్ చేసిన తొలి తమిళ సినిమా ఫ్లాప్ కావడంతో కోలీవుడ్ అసలు ఆమెకు అవకాశాలే ఇవ్వలేదు. టాలీవుడ్ వరుసగా ఇస్తోంది. అందుకని, తెలుగు సినిమాలను అభిమానించే ఆడియన్స్ పూజా మీద ఫైర్ అవుతున్నారు.
హిందీ సినిమాల్లో ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేసి... టాలీవుడ్‌ని తక్కువ చేయడం తగదని సోషల్ మీడియాలో పూజా హెగ్డే మీద ఒక రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. పాపం... ఈ విధంగా విమర్శల పాలవుతానని పూజా ఊహించలేదేమో! ట్రోల్స్ పట్ల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |