![]() |
![]() |

పాన్ ఇండియా మూవీగా రిలీజైన కన్నడ చిత్రం 'కేజీఎఫ్' ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అటు కథానాయకుడు యష్, ఇటు దర్శకుడు ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 2018 డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమాకి ప్రస్తుతం సెకండ్ పార్ట్ సిద్ధమవుతోంది. 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' పేరుతో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే థియేటర్లలో సందడి చేయాల్సింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో పాటు సంజయ్ దత్ ఆరోగ్యం కారణంగానూ ఈ సినిమా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. ఈ పిరియడ్ డ్రామాకి సంబంధించిన టీజర్‌ని ఓ స్పెషల్ డేకి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోందట. ఆ రోజు మరేదో కాదు.. యష్ బర్త్ డే అయిన జనవరి 8. కేవలం యష్ ని మాత్రం ఎలివేట్ చేసేలానే ఈ టీజర్ ని కట్ చేస్తున్నారని శాండల్ వుడ్ టాక్. మరి.. భారీ అంచనాల మధ్య రానున్న 'కేజీఎఫ్ ఛాప్టర్ 2'.. కేజీఎఫ్ లాగే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
![]() |
![]() |