![]() |
![]() |

బాలీవుడ్ మీడియా మీద నటుడు సూరజ్ పంచోలి మండిపడ్డాడు. 'ఫ... యు ఫేక్ మీడియా' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా నిరాధారమైన వార్తలు వండి వారుస్తున్నారని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు. అసలు వివరాల్లోకి వెళితే...
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కంటే వారం రోజుల ముందు ఆత్మహత్య చేసుకున్న అతడి మేనేజర్ దిశా షాలిని మర్డర్ మిస్టరీలో సూరజ్ పంచోలికి సంబంధం ఉందన్నట్టు మిర్రర్ నౌ ఛానల్ ఒక కథనం ప్రసారం చేసింది. అందులో కొన్ని ఫొటోలు చూపించింది. సూరజ్ పంచోలితో సన్నిహితంగా దిశా షాలిని మెలిగినట్టు చెప్పుకొచ్చింది. అయితే, ఆ అమ్మాయి దిశా షాలిని కాదనీ, తన స్నేహితురాలు అనుశ్రీ గౌర్ అని సూరజ్ పంచోలి తెలిపాడు.
"ఇటువంటి మీడియాను మనం విశ్వసించాలా? వాళ్ళు చూపించిన ఫొటో 2016లో తీసుకున్నది. అందులో అమ్మాయి దిశా షాలిని కాదు. నా ఫ్రెండ్ అనుశ్రీ. ఆమె ఇండియాలో ఉండదు. ప్రజలకు బ్రెయిన్ వాష్ చేయడం ఆపండి. నన్ను వేధించడం ఆపండి. ఈ వివాదంలోకి నన్ను లాగొద్దు. బాధ్యతాయుతంగా ఉండటం మొదలుపెట్టండి. లేదంటే వేరొకరి జీవితం నాశనం అవుతుంది. ఇంతకు ముందూ చెప్పాను, ఇప్పుడూ చెబుతున్నా... నా జీవితంలో దిశా షాలినిని ఎప్పుడూ కలవలేదు. ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఫ... ఫేక్ న్యూస్" అని సూరజ్ పంచోలి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.
![]() |
![]() |