![]() |
![]() |

జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమవుతున్న కామెడీ షో 'అదిరింది'. దీనికి ఇద్దరు దర్శకులు. ఒకరు భరత్. మరొకరు నితిన్. వీళ్ళిద్దరూ 'అదిరింది' కంటే ముందు 'జబర్దస్త్'కి డైరెక్షన్ చేశారు. నితిన్-భరత్‌గా ఫేమస్. వీళ్ళిద్దరితో భరత్ ఓ ఇంటివాడు అయ్యాడు. బుధవారం రాత్రి అశ్వినితో అతడి వివాహం జరిగింది.

భరత్ వివాహానికి 'అదిరింది' షోలో స్కిట్లు చేస్తున్న కంటెస్టెంట్లు, యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, రవి, భాను శ్రీ తదితరులు హాజరయ్యారు. 'జబర్దస్త్' నుండి కూడా ఎవరు రాలేదు. 'అదిరింది' షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, నవదీప్ హాజరైనట్టు లేరు. ఒకవేళ హాజరైతే ఫొటోలు బయటకు వచ్చేవి.

![]() |
![]() |