![]() |
![]() |

దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి వేదిక మారిందట. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో పెళ్లి చేయాలనుకున్నారు. ఇప్పుడు సొంత స్టూడియోలో చేయాలనుకుంటున్నారట. భాగ్యనగరంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు రానా పెళ్లి పై ప్రభావం చూపించాయి. వైరస్ ప్రభావం వలనే పెళ్లి వేదిక మారుతోందని సమాచారం. మరోవైపు పెళ్లి కి వచ్చే అతిథులు సంఖ్య 30 కంటే దాటని రానా తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలిపారు.
"పెళ్లికి కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరవుతారు. మా బంధువులు, సినిమా పరిశ్రమలో వ్యక్తులను కూడా పిలవడం లేదు. ఇతరులు ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడం ఇష్టం లేకే తక్కువ మందితో వివాహ వేడుక జరిపించాలని నిర్ణయించాం" అని సురేష్ బాబు తెలిపారు. పెళ్ళికి వచ్చే అతిథులందరికీ కరుణ టెస్టులు చేయించుకున్నట్లు రానా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మిహికా బజాజ్ తల్లి బంటీ బజాజ్ తెలిపారు.
![]() |
![]() |