![]() |
![]() |

వినోదం పండించడంలో మాస్ మహారాజ్ రవితేజది ప్రత్యేక శైలి. అసలు వినోదం విడిచిపెట్టకుండా కథతో సాము చేయడంలో దర్శకుడు మారుతిది అందెవేసిన చేయి. అటువంటి వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయనున్నారని టాలీవుడ్ ఫిలింనగర్ టాక్.
'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్'తో తనపై పడిన అడల్ట్ దర్శకుడి ముద్రను 'మహానుభావుడు', 'భలే భలే మగాడివోయ్' సినిమాలతో మారుతి చెరిపేసుకున్నారు. ఇటీవల 'ప్రతిరోజూ పండగే'తో మరో విజయం అందుకున్నారు. ఇటీవల రవితేజకు ఆయనో కథ చెప్పారట. కథ, మారుతి శైలి వినోదం హీరోకి బాగా నచ్చాయట. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పారట. ప్రస్తుతం మారుతి అదే పనిలో ఉన్నారని సమాచారం.
ప్రస్తుతం రవితేజ 'క్రాక్' చేస్తున్నారు. తరవాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా, మలయాళ హిట్ 'అప్పయనుమ్ కోషియమ్' రీమేక్ చేయాలి. ఆ తరవాత మారుతి సినిమా ఉంటుందని తెలుస్తోంది/. ఈలోపు మారుతి ఒక వెబ్ సిరీస్ చేయనున్నారు.
![]() |
![]() |