![]() |
![]() |

మొదట డిస్ట్రిబ్యూటర్‌గా రాణించి, వి.వి. వినాయక్ డైరెక్ట్ చేసిన దిల్ ఫిల్మ్‌తో ప్రొడ్యూసర్‌గా మారి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటరమణా రెడ్డి అలియాస్ దిల్ రాజు పేరు తెలీని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇవాళ అగ్ర నిర్మాతగా టాలీవుడ్‌లో వెలిగిపోతున్న ఆయన ఏక కాలంలో పలు సినిమాలు నిర్మిస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మొదట్లో తోటి డిస్ట్రిబ్యూషన్ పార్టనర్ గిరితో కలిసి సినిమాలు నిర్మించిన ఆయన.. ఆ తర్వాత సోలోగా సినిమాలు తీస్తూ వచ్చారు. తర్వాత తన కజిన్ శిరీష్, ఫ్రెండ్ లక్ష్మణ్‌తో కలిసి సినిమాలు నిర్మించారు. ఇప్పుడు లక్ష్మణ్ వేరు పడ్డారు.
ఇప్పుడు రాజు కుటుంంబంలోని నవతరం ఆయన వ్యాపారాల్లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే రాజు అన్న కుమారుడు హర్షిత్‌రెడ్డి ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ వస్తుండగా, ఆయన భార్య గౌతమి కూడా దిల్ రాజు ఆఫీస్‌లో ఒక విభాగం బాధ్యతలు చేపట్టినట్లు వినిపిస్తుంది. ఆమె తరచుగా ఆ ఆఫీస్‌కు వస్తున్నారు. అలాగే పెళ్లి తర్వాత ఇప్పటి వరకూ కుటుంబ వ్యవహారాలకు పరిమితమైన రాజు కుమార్తె హన్షిత కూడా ఇప్పుడు రాజుకు చెందిన థియేటర్ల లెక్కలు చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మొత్తానికి నవతరం రాకతో దిల్ రాజు బిజినెస్, ఆఫీస్ కళకళలాడుతున్నాయి.
![]() |
![]() |