![]() |
![]() |

కార్తీ కథానాయకుడిగా నటించిన 'ఖైదీ' చిత్రం తమిళ తంబీలతో సహా తెలుగు ప్రేక్షకులనూ అమితంగా ఆకట్టుకుంది. దర్శకుడిగా లోకేష్ కనగరాజ్‌కి విపరీతమైన పేరొచ్చింది. విమర్శల ప్రశంసలు, ప్రేక్షకుల అభినందనలు అందుకున్నాడు. 'ఖైదీ' తరవాత తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన విజయ్‌తో 'మాస్టర్' సినిమా చేశాడు. లోకనాయకుడు కమల్ హాసన్, 'సింగమ్' సూర్యతో ఒక్కో సినిమా, కార్తీతో 'ఖైదీ' సీక్వెల్ సినిమాలు లోకేష్ కనగరాజ్ లైనులో ఉన్నాయి. అతడితో తెలుగులో సినిమా చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నిస్తోంది.
తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రి ఒకటి. మహేష్ బాబు హీరోగా 'శ్రీమంతుడు', జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 'జనతా గ్యారేజ్', రామ్ చరణ్ హీరోగా 'రంగస్థలం' సినిమాలు తీసింది. చిన్న సినిమాలు కూడా చేస్తోంది. అందువల్ల, మైత్రిలో సినిమా చేయడానికి లోకేష్ కనగరాజ్ సుముఖంగా ఉన్నాడట. అయితే, తమిళంలో తన కమిట్మెంట్లు కంప్లీట్ చేసుకుని వస్తానని చెప్పాడట. హీరో ఛాయస్ దర్శకుడికి వదిలినట్టు టాక్.
![]() |
![]() |