![]() |
![]() |

మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక వ్యక్తిపై ఇప్పటికే 'పవర్ స్టార్' ఫిల్మ్‌ను ఏటీటీలో రిలీజ్ చేసిన సెటైరికల్ సినిమాల స్పెషలిస్ట్ రామ్‌గోపాల్ వర్మ లేటెస్ట్‌గా ఆ ఫ్యామిలీలోని మరో వ్యక్తిపై 'అల్లు' అనే చిత్రాన్ని తీసేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు థియేటర్లను టార్గెట్ చేస్తూ ఆయన తీస్తున్న 'మర్డర్' మూవీ కోర్టు కేసును ఎదుర్కొంటోంది. కాగా ఆర్జీవీ ఎంత ఆర్భాటంగా, వివాదాస్పందంగా పబ్లిసిటీ చేసినప్పటికీ 'పవర్ స్టార్' ఫిల్మ్‌కు ఆశించిన రీతిలో డబ్బులు రాలేదని తెలిసింది. దీంతో వర్మే షాక్ తిన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
'పవర్ స్టార్' కంటే ముందు రిలీజ్ చేసిన 22 నిమిషాల షార్ట్ ఫిల్మ్ 'నగ్నం' (నేక్డ్)కే ఎక్కువ డబ్బులొచ్చాయంట. శ్రీ రాపాక అనే ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసిన యువతిని వల్గర్‌గా చూపిస్తూ ఆయన తీసిన ఆ ఫిల్మ్‌నే ఎక్కువమంది చూశారు. నిజానికి 'పవర్ స్టార్' ట్రైలర్‌కే సొమ్ము చేసుకోవాలని ఆయన చేసిన ప్లాన్ దారుణంగా ఫ్లాపయింది. ఆ ట్రైలర్‌ను డబ్బులు పెట్టి చూసేందుకు అతి తక్కువ మందే ముందుకు రావడంతో.. ముందుగానే దాన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేయించి, లీకయ్యిందనే నెపంతో అప్పటికే డబ్బులు చెల్లించినవారికి వాపసు చేస్తామని వర్మ ప్రకటించారని కూడా ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకున్నారు.
'పవర్ స్టార్' ఫిల్మ్ విషయంలో పవన్ కల్యాణ్ మౌనం వహించినా, ఆయన ఫ్యాన్స్ మాత్రం నానా హంగామా చేసి, ఆర్జీవీపై వరుసపెట్టి సినిమాలను అనౌన్స్ చేశారు. ఇది కూడా ఆర్జీవీకి పబ్లిసిటీ తెచ్చింది. అయినప్పటికీ 'పవర్ స్టార్' ఫిల్మ్ ఆన్‌లైన్‌లో ఫ్లాపయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'పవర్ స్టార్' పరిస్థితే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఆయన రిలీజ్ చేసే 'అల్లు'ను మాత్రం జనం చూస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |