![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. టికెట్ ధరలు, స్పెషల్ షోలతో పాటు పలు అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.
సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఐదో షోలు, పెద్ద సినిమాలకు ప్రత్యేక టికెట్ ధరలు వంటి వాటికి ఓకే చెప్పిన ప్రభుత్వం కొన్ని కండీషన్స్ పెట్టింది. రెమ్యునేషన్స్ కాకుండా 100 కోట్లకు పైగా బడ్జెట్ అయిన సినిమాలు పదిరోజుల పాటు ప్రత్యేక ధరలకు టికెట్స్ అమ్ముకోవచ్చని చెప్పింది. కానీ ఆ సినిమా షూటింగ్ కనీసం 20 శాతం ఏపీలో జరిగుండాలని మెలిక పెట్టింది. అలాగే ఐదో షోకి అనుమతి ఇచ్చింది కానీ, అందులో ఒక షో 20 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మితమైన సినిమాలు కేటాయించింది కండిషన్ పెట్టింది. దీంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలకు ఇబ్బందికరంగా మారింది. రీసెంట్ గా విడుదలైన 'రాధేశ్యామ్' మూవీది కూడా అదే పరిస్థితి. దానికి తోడు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి, డీవీవీ దానయ్య వెళ్లి ఏపీ సీఎం జగన్ తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ మార్చి 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓ వైపు తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడంతో పాటు ఐదో షోకి, బెనిఫిట్ షోలకు అనుమతి ఉంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ దర్శక నిర్మాతలు రాజమౌళి, దానయ్య సీఎం జగన్ ని కలిసి టికెట్ ధరలు, స్పెషల్ షోలపై చర్చించారు. ఈ భేటీలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. మరి ఆర్ఆర్ఆర్ విషయంలో జగన్ సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |