![]() |
![]() |

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' పలు సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు మార్చి 25 న విడుదలకు సిద్ధమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ కూడా షురూ చేశారు. ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపుతూ మార్చి 14 న 'ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ యాంథమ్'ను విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుడు అది కూడా వాయిదా పడింది.
'ఎత్తర జెండా' అంటూ సాగే 'ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ యాంథమ్'ను మార్చి 14 న విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఆ సాంగ్ కి సంబంధించిన పోస్టర్, ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి సాంగ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు సాంగ్ విడుదల కావాల్సి ఉండగా, మూవీ టీమ్ ఫ్యాన్స్ బిగ్ షాక్ ఇచ్చింది. టెక్నికల్ సమస్యల కారణంగా ఈరోజు సెలబ్రేషన్ యాంథమ్ ను విడుదల చేయలేకపోతున్నామని, రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. దీంతో తారక్, చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమానే అనుకుంటే, సాంగ్స్ కూడా వాయిదా వేస్తున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అవుతున్నారు.
'ఆర్ఆర్ఆర్'లో ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్ గా నటించారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.
![]() |
![]() |