![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పోర్ట్స్ డ్రామాలో నటించనేలేదు. త్వరలో ఆ ముచ్చట తీరనుందని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రం కోసం తారక్ ప్రత్యేకంగా మేకోవర్ కానున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఉప్పెన` వంటి సంచలన చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. క్రీడా నేపథ్యంలో తెరకెక్కనుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోందని ఇన్ సైడ్ టాక్. కాగా, `పెద్ది` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా కోసం తారక్.. కబడ్డీ ఛాంపియన్, కోచ్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. అందుకోసం.. ప్రత్యేకంగా మేకోవర్ కానున్నారని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
Also Read: పవన్‌పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్..
ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` సమ్మర్ స్పెషల్ గా మార్చి 25న రిలీజ్ కాబోతోంది. మరోవైపు.. `జనతా గ్యారేజ్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివతో మరో సినిమాని చేయబోతున్నారు తారక్. దాంతో పాటే సమాంతరంగా బుచ్చిబాబు సినిమా చిత్రీకరణ జరుపుకోనుందట.
![]() |
![]() |