![]() |
![]() |
.webp)
ఫ్యాన్స్ దెబ్బకి 'ఆర్ఆర్ఆర్' మేకర్స్ దిగొచ్చారు. కొద్ది గంటల క్రితం 'ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ యాంథమ్'ను వాయిదా వేశామని ట్విట్టర్ వేదికగా ప్రకటించిన మేకర్స్.. ట్విట్టర్ లో ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో దెబ్బకి మాట మార్చారు. ఈరోజే విడుదల అంటూ మరో ట్వీట్ చేసి ఫ్యాన్స్ ని కూల్ చేశారు.

ఎత్తర జెండా' అంటూ సాగే 'ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ యాంథమ్'ను మార్చి 14 న విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఆ సాంగ్ కి సంబంధించిన పోస్టర్, ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి సాంగ్ ఈరోజు విడుదల కావాల్సి ఉండగా, టెక్నికల్ సమస్యల కారణంగా ఈరోజు సెలబ్రేషన్ యాంథమ్ ను విడుదల చేయలేకపోతున్నామని, రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని మూవీ టీమ్ ఫ్యాన్స్ బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో మేకర్స్ బండబూతులు తిట్టారు. దీంతో దిగొచ్చిన మేకర్స్ ఈరోజే సాంగ్ విడుదల చేస్తున్నామంటూ ఫ్యాన్స్ ని కూల్ చేసింది.
.webp)
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మార్చి 25 న విడుదల కానుంది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.
![]() |
![]() |