![]() |
![]() |

'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాలతో మంచి గుర్తింపు కిరణ్ అబ్బవరం ఇటీవల 'సెబాస్టియన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. వరుస అవకాశాలు అందుకుంటున్న కిరణ్ ఏకంగా గీత ఆర్ట్స్-2 లో నటించే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో మొదలైంది.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూజా కార్యక్రమాలతో తిరుపతిలో మొదలైంది. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80 శాతం షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు కూడా ఉండబోతున్నాయి.
.webp)
'వినరో భాగ్యము విష్ణు కథ' అనే టైటిల్ కు ఇప్పటికే అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కశ్మీర పర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. బాబు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |