![]() |
![]() |

తన తండ్రి, ప్రముఖ దర్శకుడు రాకేశ్ రోషన్ కాంబినేషన్ లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటించిన సినిమాలన్నీ విశేషాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. `క్రిష్` సిరీస్ తో హృతిక్ ఇమేజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. `కోయి మిల్ గయా` (2003), `క్రిష్` (2006), `క్రిష్ 3` (2013).. ఇలా `క్రిష్` సిరీస్ లో ఇప్పటివరకు మూడు చిత్రాలు రాగా అవన్నీ కూడా వసూళ్ళ వర్షం కురిపించాయి. కట్ చేస్తే.. త్వరలో ఈ సిరీస్ లో నాలుగో సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ని కూడా రాకేశ్ రోషన్ రూపొందించనున్నట్లు సమాచారం.
Also Read: అతడితో మరోసారి నయన్ రొమాన్స్!
కాగా, `క్రిష్ 4`కి సంబంధించిన చిత్రీకరణ జూన్ నుంచి ప్రారంభం కానుందట. అలాగే, టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో జాదూ (`కోయి.. మిల్ గయా`లోని గ్రహాంతర వాసి పాత్ర) మరోసారి దర్శనమివ్వనుందట. ప్రమాదంలో పడ్డ తన తండ్రి రోహిత్ మెహ్రాని జాదూ సహాయంతో క్రిష్ ఎలా కాపాడుతాడు? అనే అంశం చుట్టూ `క్రిష్ 4` తిరుగుతుందట. 2013 చివరలో లేదా 2014 ప్రారంభంలో `క్రిష్ 4` రిలీజ్ కావచ్చని సమాచారం. మరి.. `క్రిష్` సిరీస్ లోని గత చిత్రాల్లాగే `క్రిష్ 4` కూడా ఘనవిజయం సాధిస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, హృతిక్ రోషన్ ప్రస్తుతం `విక్రమ్ వేద`, `ఫైటర్` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది `విక్రమ్ వేద` రిలీజ్ కానుండగా.. వచ్చే సంవత్సరం `ఫైటర్` తెరపైకి రానుంది.
![]() |
![]() |