![]() |
![]() |

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ఇటీవల 'నాట్యం' సినిమాతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. తాజాగా ఆమె ఓ డ్యాన్స్ వీడియోను రూపొందించారు. ఆ వీడియోను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ప్రశంసించడం విశేషం.
ఉమెన్స్‌డే సందర్భంగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం 'ఫినామినల్ ఉమెన్' కు సంధ్యారాజు మోడ్రన్ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ పెర్‌ఫామెన్స్ వీడియోను రూపొందించారు. సంధ్యారాజు పేరుతో ఉన్న తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసిన ఈ డ్యాన్స్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోని ఏఆర్ రెహమాన్ సైతం ప్రశంసించడం విశేషం. అంతేకాదు ఈ వీడియోని తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు.

తెలుగు క్లాసికల్ డ్యాన్సర్ సంధ్యారాజుని ప్రశంసిస్తూ ఏఆర్ రెహమాన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
![]() |
![]() |