![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కి సినిమా ఇండస్ట్రీలో చాలామంది అభిమానులు ఉన్నారు. అందులో శ్రీముఖి కూడా ఒకరు అని చెప్పుకోవాలి. పవన్‌తో ఫొటో దిగిన ఆనందం ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ చేస్తున్నారు. మొన్నటి వరకూ గుబురు గడ్డంతో ఉన్న ఆయన, సినిమా కోసం గడ్డం తీసేశారు. హ్యాండ్సమ్ లుక్‌లోకి వచ్చారు. షూటింగ్ చేసే దగ్గర పవన్‌తో శ్రీముఖి ఫొటోలు దిగినట్టు ఉన్నారు.
‘‘ఓకే... ఏం టైప్ చేయాలో నాకు తెలియదు. లవ్... లవ్... లవ్... పవర్‌స్టార్’’ అని పవన్‌తో దిగిన రెండు ఫొటోలను శ్రీముఖి పోస్ట్ చేశారు. అందులో ఒకటి సెల్ఫీ కాగా... మరొకటి ఎదుటివాళ్లు తీసిన ఫొటో! ఆ ఫొటోను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తీసినట్టు శ్రీముఖి పేర్కొన్నారు. ఈ ఫొటోలకు శ్రీముఖి బెస్ట్ ఫ్రెండ్, యాంకర్ విష్ణుప్రియ పెట్టిన కామెంట్ ఆసక్తికరంగా ఉంది. మేటర్ ఏం టైప్ చేయకుండా, జస్ట్ సంతోషంతో నవ్వుతున్న ఎమోజీలతో పాటు లవ్ సింబల్ ఎమోజీలను పోస్ట్ చేశారు.

![]() |
![]() |