![]() |
![]() |

బాలీవుడ్ నటుడు మిళింద్ సోమన్ నగ్నంగా పరిగెత్తి నలుగురికీ షాక్ ఇచ్చాడు. షాక్ అంటే... నగ్నంగా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే... ఒంటి మీద నూలుపోగు లేకుండా, అలా నగ్నంగా పెరిగెడుతున్నప్పుడు జనాలు ఉన్నారో లేదో గానీ, అతడి భార్య అంకిత కొన్వార్ మాత్రం ఉన్నారు. ఎందుకంటే... ఫొటో తీసినది తన భార్య అని మిళింద్ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ న్యూడ్ ఫీట్ ఎందుకు చేశారంటే?
మిళింద్ పుట్టినరోజు బుధవారం. తనకు తాను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొంటూ సోషల్ మీడియాలో బీచ్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు దిగిన న్యూడ్ ఫొటో పోస్ట్ చేశారు. "55 అండ్ రన్నింగ్" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. తనకు 55 ఏళ్ళు వచ్చినప్పటికీ పరుగు పెట్టడం ఏమాత్రం తగ్గలేదని, ఫిట్నెస్ లెవెల్స్ బాగున్నాయని చెప్పడానికి చేసిన ప్రయత్నం అన్నమాట.
మిళింద్ వయసు 55 అయితే అంకిత కొన్వార్ వయసు 29 సంవత్సరాలే. అతడికి ఆమె రెండో భార్య. వీళ్ళిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. గతంలో ఫ్రెంచ్ నటి మిలెనే జంపనితో మిళింద్ వివాహం జరిగింది. అయితే, ఆ కాపురం మూడేళ్లే నడిచింది. 2009లో విడాకులు తీసుకున్నారు.
![]() |
![]() |