![]() |
![]() |

కాజల్ అగర్వాల్ జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది. మొన్నటివరకూ ఆమె మిస్. ఇప్పుడు మిసెస్. ఇప్పుడామె గౌతమ్ కిచ్లూ భార్య. పెళ్లితో వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. పెళ్లంటే పూజలు, పునస్కారాలు కామన్ కదా! నాలుగైదు రోజులుగా వాటితో కాజల్‌కి సరిపోతోంది. ఇంతలో కర్వా చౌత్ వచ్చేసింది. ఈ పూజలకు తోడు కొత్తింట్లోకి కాజల్, గౌతమ్ కిచ్లూ అడుగుపెట్టినట్టు తెలుస్తోంది.
‘‘కొత్త ప్రారంభాలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గత వారం రోజులుగా అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు గొప్పగా ఫీలవుతున్నాను. నా భార్య, మా కొత్త ఇల్లు’’ అని గౌతమ్ కిచ్లూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్ట్ చేశారు. అందులో హోమంలో నవధాన్యాలు, ఏవో వేస్తున్న కాజల్, ఆమె పక్కన గౌతమ్‌ని చూడవచ్చు. ఈ కొత్త జంటను అభినందిస్తూ పలువురు సెలబ్రిటీలు, సామాన్యులు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపిస్తున్నారు. పెళ్లి హడావిడి మధ్యలో కొంతమందికి కాజల్ రిప్లైలు ఇస్తున్నారు.

![]() |
![]() |