![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన చిత్రం 'అత్తారింటికి దారేది'. అందులో 'అమ్మో బాపుగారి బొమ్మో..' అంటూ సాగే పాటలో పవన్‌తో కనువిందుగా చిందులేశారు కన్నడ కోమలి ప్రణీత. కట్ చేస్తే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరోమారు పవన్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు రెడీ అవుతున్నారట ఈ టాలెంటెడ్ బ్యూటీ.
ఆ వివరాల్లోకి వెళితే.. క్రిష్ డైరెక్షన్‌లో పవన్ ఓ పిరియడ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఓ నాయికగా నటించనుండగా.. పవన్‌ని ఆరాధించే అమ్మాయి పాత్రలో ప్రణీత దర్శనమిస్తారట. ఇప్పటికే ఈ మేరకు సంప్రదింపులు జరిగాయని సమాచారం. త్వరలోనే ప్రణీత ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరి.. 'అత్తారింటికి దారేది'తో అలరించిన పవన్, ప్రణీత జంట.. మరోసారి కాసుల పంట పండిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |