![]() |
![]() |

హీరోయిన్ మెహరీన్ కౌర్ ఫిర్జాడా గుర్తున్నారా? సంక్రాంతికి ‘ఎంత మంచివాడవురా’తో, జనవరి నెలాఖరున ‘ఆశ్వత్థామ’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం మాల్దీవుల్లోని సముద్రజలాల్లో విహరిస్తున్నారామె. అక్కడికి తమ్ముడు గుర్‌ఫతేహ్ సింగ్ ఫిర్జాదా, తల్లి పమ్మీ కౌర్‌తో కలిసి వెళ్ళారు. ఫ్యామిలీ ట్రిప్ అన్నమాట. ఒక ప్రయివేట్ ఐల్యాండ్‌లో రిసార్ట్ బుక్ చేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు.

నవంబర్ 5న మెహరీన్ పుట్టినరోజు. అందుకని, సెలబ్రేట్ చేసుకోవడానికి మాల్దీవులు వెళ్ళారు. అక్కడ స్విమ్‌సూట్ వేసుకుని ఫూల్‌లో తమ్ముడితో కలిసి ఫొటోలు దిగారు. అదీ సంగతి. సాధారణంగా సినిమాల్లో అందాల ప్రదర్శన చేయడానికి మెహరీన్ వ్యతిరేకమే. ఎక్స్‌పోజింగ్ చేసిన సందర్భాలు తక్కువ. ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు స్విమ్‌సూట్ ఫొటోలు పోస్ట్ చేయడంతో నెటిజన్లు సర్‌ప్రైజ్ అయ్యారు. అదీ సంగతి.

![]() |
![]() |