![]() |
![]() |
సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచే కుమార్తె రాగ పుష్యమి వివాహం ఆశిష్ వర్మతో బుధవారం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు చిత్రసీమ నుంచి కొంతమంది ప్రముఖులు, రఘు సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలో సందడి చేసి, వధూవరులను ఆశీర్వదించారు. డైరెక్టర్ వి.వి. వినాయక్. మ్యూజిక్ డైరెక్టర్లు కోటి, ఆర్పీ పట్నాయక్, గాయకుడు మనో, రైటర్-డైరెక్టర్ బీవీఎస్ రవి తదితరులు ఈ వేడుకలో పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు. ఈ ఏడాది మే నెలలో రాగ, ఆశిష్ నిశ్చితార్ధం జరిగింది.
![]() |
![]() |