![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ధైర్యానికి మెచ్చుకోవాలి. అన్‌లాక్ పీరియడ్‌లో, కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టని టైమ్‌లో షూటింగ్ చేసిన టాలీవుడ్ హీరోల్లో అతను ఒకడు. ఈ ఏడాది విదేశాలకు విహారయాత్రలకు వెళ్ళిన హీరోల్లోనూ అతను ఉన్నాడు. ప్రజెంట్ బీచ్ రిసార్ట్స్‌కి ఫేమస్ అయిన మాల్దీవుల్లో అతను ఉన్నాడు. సతీమణి శ్రీజతో కలిసి అక్కడికి వెళ్ళాడు.
ఎర్లీ మార్నింగ్ కాఫీలు, క్యాండిల్ లైట్ డిన్నర్లు, మధ్యలో ప్రకృతి ఒడిలో షికార్లు... కల్యాణ్ ధేవ్, శ్రీజ దంపతులు రెండు మూడు రోజులుగా బీచ్ ఏరియాలో ఎంజాయ్ చేస్తూ, మాల్దీవుల్లో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ తాప్సీ పన్ను మాల్దీవులు వెళ్ళి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలకు మాల్దీవులు హాట్ ఫేవరెట్ వెకేషన్ డెస్టినేషన్ అయింది.

సినిమాలకు వస్తే... కరోనా టైమ్‌లో కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ సినిమా షూటింగ్ చేశారు. అది కాకుండా ‘లౌక్యం’ సహా పలు హిట్ సినిమాలకు రైటర్‌గా వర్క్ చేసిన శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించారు.


![]() |
![]() |