![]() |
![]() |

కాజల్ అగర్వాల్ ఇటీవలే కొత్త ఇంట్లో అడుగుపెట్టారు. గృహ ప్రవేశం మొన్నే జరిగింది. కొత్త ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ అంతా భర్త గౌతమ్ చూసుకున్నారని కాజల్ తెలిపారు. అతను చాలా మంచి అబ్బాయి అనీ, అందరినీ గౌరవిస్తాడు అనీ, తనను బాగా అర్థం చేసుకుంటాడు అనీ కాజల్ చెబుతున్నారు. భర్త విషయంలో తాను చాలా లక్కీ అని మురిసిపోయారు.
పెళ్లయిన కొన్ని రోజులకు కాజల్ అగర్వాల్ కర్వా చౌత్ పూజలో పాల్గొన్నారు. భర్త బాగు కోరుతూ ఉపవాసం ఉన్నారు. దాని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నించగా... "చాలా సంతోషంగా అనిపించింది. నేనిలా రోజంతా ఉపవాసం ఉండటం ఇదే తొలిసారి. ఉదయం నాలుగింటికి అందరం నిద్ర లేచాం. అత్త గారు, వదినలతో కలిసి పూజ చేశా. నాతో పాటు గౌతమ్ కూడా ఉపవాసం ఉన్నాడు" అని చెప్పారు.
వ్యక్తిగత జీవితానికి తొలి ప్రాధాన్యం ఇస్తానని, అలాగని వృత్తిపర జీవితానికి దూరం కానని కాజల్ చెప్పుకొచ్చారు. రెండిటినీ వేర్వేరుగా ఉంచుతూ ముందుకు వెళ్తానని అన్నారు. దీపావళి తర్వాత సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తానని కాజల్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'ఆచార్య'లో నటిస్తున్నట్టు మరోసారి స్పష్టం చేశారు.

![]() |
![]() |