![]() |
![]() |

బూతుతో యువతను ఆకట్టుకోవాలని కొందరు బోల్డ్ గా చేస్తున్న ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం. అడల్ట్ సన్నివేశాలతో సినిమా లేదా వెబ్ సిరీస్ ని నింపేస్తున్నారు. ఇంకొందరు ప్రచార పర్వంలో బూతు పదాలను యదేచ్ఛగా వాడుతున్నారు. 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఓ బూతు మాట వాడారు. అప్పట్లో దానిపై రచ్చ జరిగింది. ప్రస్తుతానికి వస్తే... హీరోయిన్ సీరత్ కపూర్ సినిమా షూటింగ్ లో ఒక బూతు మాటను విచ్చలవిడిగా వాడారని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఓటీటీలో విడుదలైన 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాతో సీరత్ కపూర్ విజయం అందుకున్నారు. అందులో సిద్దు జొన్నలగడ్డ హీరో. అతడితో సీరత్ నటించిన మరో సినిమా 'మా వింత గాథ వినుమా'. ఇటీవల ఆ సినిమా మేకింగ్ వీడియో విడుదల చేశారు. అది సీరత్ స్పెషల్ అన్నమాట. సీన్ సరిగా చేయలేకపోయినా... డైలాగ్ సరిగా చెప్పలేకపోయినా.... 'F**K' అనే పదాన్ని సీరత్ వాడేశారు. ఆమెకు అది ఊతపదం అని అనుకోవాలి. ఈతరం యువత అందరూ ఆ పదాన్ని వాడుతున్నారని చెప్పుకోవాలో లేదా ఇకపై ఆ పదాన్ని బూతు కింద పరిగణించకూడదో? మొత్తానికి ఈ పదం వల్ల, ఆ వీడియో వల్ల సినిమాకి పబ్లిసిటీ లభిస్తోంది.
![]() |
![]() |