![]() |
![]() |

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందించిన 'సన్నాఫ్ సత్యమూర్తి' మూవీలో ఒక కీలక పాత్రలో కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర నటించిన విషయం తెలిసిందే. నెగటివ్ షేడ్స్ ఉన్న దేవరాజ్ అనే ఒక ఫ్యాక్షనిస్ట్‌గా ఆయన అందులో కనిపించారు. సెకండాఫ్‌లో ఆ క్యారెక్టర్ కథకు కీలకంగా ఉంటుంది. నిజానికి ఆ క్యారెక్టర్‌కు త్రివిక్రమ్ ఫస్ట్ చాయిస్ ఉపేంద్ర కాదు.. యాక్షన్ కింగ్ అర్జున్. ఆ క్యారెక్టర్ కోసం మొదట త్రివిక్రమ్ ఊహించింది అర్జున్‌ను. ఆ పాత్ర కోసం ఆయనను సంప్రదించారని కూడా అప్పట్లో ఫిల్మ్ నగర్‌లో ప్రచారంలోకి వచ్చింది కూడా.
కానీ నెగటివ్ షేడ్స్ ఉన్న ఆ క్యారెక్టర్ చేయడానికి అర్జున్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, తెలుగు ప్రేక్షకుల్లోనూ ఇమేజ్ ఉన్న ఉపేంద్ర దగ్గరకు వెళ్లారనీ, ఆయన ఒప్పుకున్నారనీ చెప్పుకున్నారు. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో దేవరాజ్ క్యారెక్టర్ చెయ్యకపోయినా, తర్వాత ఆ తరహా పాత్రల అవకాశాలు వస్తుండటంతో అర్జున్ మనసు మార్చుకున్నారనీ, నితిన్ సినిమాలో 'లై'లోనూ, విశాల్ మూవీ 'అభిమన్యుడు'లోనూ ఆయన నెగటివ్ రోల్స్ చేశారనీ తెలుస్తోంది.
![]() |
![]() |