![]() |
![]() |
.jpg)
రవితేజ హీరోగా నటించిన 'డిస్కో రాజా' మూవీలో విలన్‌గా నటించిన బాబీ సింహా హీరోగా 'వసంత కోకిల' అనే సినిమా రూపొందుతోంది. జాతీయ అవార్డ్ గ్రహీత కూడా అయిన సింహా నటిస్తోన్న ఈ మూవీని రమణన్ పురుషోత్తమ డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగులో ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకాలపై రామ్ తళ్లూరి, రేష్మీ సింహా అందిస్తున్నారు.
ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా '@నర్తనశాల' ఫేమ్ కశ్మీర పర్‌దేశి హీరోయిన్ గా నటిస్తోంది. నవంబన్ 6న బాబీ సింహా పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి ఈ సినిమా టైటిల్ 'వసంత కోకిల'ని ఎనౌన్స్ చేయడంతో పాటు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫస్ట లుక్ ని కూడా విడుదల చేశారు. అలానే తమిళ స్టార్ హీరో ధనుష్, కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాకి సంబంధించిన తమిళ, కన్నడ టైటిల్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్లని ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు.
రొమాంటిక్ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా రెడీ అవుతోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్‌లో బాబీ సింహా విలక్షణత ప్రతిబింబించేలా చేతిలో విల్లు-బాణం, ఫారేస్ట్ బ్యాక్ డ్రాప్, డార్క్ గ్రీన్ కలర్ టింట్ ఇలా ఎన్నో ఉత్కంఠ రేపే ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా జానర్ కి, బాబీ సింహా అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కి తగిన విధంగానే దర్శకుడు రమణన్ 'వసంత కోకిల'ను తెరకెక్కించారని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతోంది. రాజేశ్ మురుగేశన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి గోపి అమరనాథ్ సినిమాటోగ్రాఫర్.
.jpg)
![]() |
![]() |