![]() |
![]() |

శ్రావణి ఆత్మహత్య కేసులో తాజాగా 'ఆర్ఎక్స్ 100' మూవీ ప్రొడ్యూసర్ అశోక్‌రెడ్డి గుమ్మకొండ పేరు రావడం ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చలకు దారితీసింది. శ్రావణి ఆత్మహత్య చేసుకున్న సెప్టెంబర్ 7న ఆమె దేవరాజ్‌తో కలిసి పంజాగుట్టలోని శ్రీకన్య హోటల్‌లో కలిసి భోంచేసిన సీసీ ఫుటేజ్ పోలీసులకు లభ్యమైన విషయం తెలిసిందే. అయితే దేవరాజ్‌తో శ్రావణి సన్నిహితంగా మెలగుతున్న సంగతిని సాయికృష్ణారెడ్డి ఆమె కుటుంబ సభ్యులకు చేరవేశాడంటున్నారు. దీనిపై కుటుంబ సభ్యులు శ్రావణితో గొడవ పడ్డారని ఆమె తనకు చెప్పినట్లు పోలీసుల విచారణలో దేవరాజ్ వెల్లడించాడు.
కాగా ఈ కేసులో అశోక్‌రెడ్డి అనే నిర్మాత పేరు కూడా బయటకు వచ్చింది. ఆయన ఎవరో కాదు.. 'ఆర్ఎక్స్ 100' మూవీ ప్రొడ్యూసర్ అశోక్‌రెడ్డి గుమ్మకొండ. ఆ సినిమా హీరో కార్తికేయకు స్వయానా బాబాయ్. శ్రావణితో సాయిరెడ్డి, అశోక్‌రెడ్డి చేసిన సంభాషణలు టేపులు బయటకొచ్చాయి. వీటిలో దేవరాజ్‌ను ఉద్దేశించి శ్రావణితో కాస్త కఠినంగానే సాయిరెడ్డి మాట్లాడటం కనిపించింది. అందులో "వాడిని చంపుతా, వీడిని చంపుతా అనడం ఎందుకు, లైఫ్‌ను బాగా చూసుకో" అని సాయిరెడ్డికి శ్రావణి సూచించింది.
అలాగే అశోక్‌రెడ్డితో మాట్లాడిన సంభాషణల్లో "చూశావా.. ఆడికి లేని ఐడియాలు ఈళ్లిస్తున్నారు. నేను చచ్చిపోతానని చెప్పలేదు. మా అమ్మకు ఉరేసుకొని చచ్చిపోద్ది అని చెప్తున్నాడ"న్నట్లు తెలిపింది శ్రావణి. ఎవరిని ఉద్దేశించి ఆమె ఆ మాటలు అశోక్‌రెడ్డికి చెప్పిందనేది తెలియాల్సి ఉంది. ఏదో కేసు గొడవ గురించి వాళ్లు మాట్లాడుకున్నారు. "కోర్టులో కాంప్రమైజ్ అయితే మంచిది కదా" అని ఎవరి గురించో అశోక్‌రెడ్డి చెప్పారు. స్టేషన్ నుంచి ఫోన్ వస్తే తానొస్తానని చెప్తున్నానని ఆయనకు శ్రావణి తెలిపింది. "బాగానే చెప్పాను కదా?" అని శ్రావణి అడిగితే, "మంచిగనే చెప్పావ్" అని అశోక్‌రెడ్డి అన్నారు. "వీళ్లేంటి మళ్లీ మనకి బెదిరిచ్చుడేంటి?" అని అశోక్‌రెడ్డి ఆమెను అడిగారు. ఆ సంభాషణను బట్టి అశోక్‌రెడ్డితో శ్రావణికి సన్నిహిత పరిచయం ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ ఆడియో ఫుటేజ్‌లు బయటకు రావడంతో అశోక్‌రెడ్డిని కూడా పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
![]() |
![]() |