![]() |
![]() |

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కు సంక్రాంతి సీజన్‌తో మంచి అనుబంధమే ఉంది. తను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం 'దేవదాస్' (2006) ముగ్గుల పండక్కే సందడి చేసింది. ఆ తరువాత అదే సీజన్‌లో వచ్చిన 'మస్కా' (2009), 'నేను శైలజ' (2016) కూడా విజయపథంలో పయనించాయి. ఇలాంటి లక్కీ సీజన్‌లోనే తన తాజా చిత్రం 'రెడ్'తో పలకరించబోతున్నారు రామ్.
'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాల తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన ఈ సినిమాని రామ్ హోమ్ బేనర్ స్రవంతి మూవీస్ నిర్మించింది. మరి.. లక్కీ సీజన్‌లో వస్తున్న రామ్.. మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి. అలాగే 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత రామ్ నుంచి వస్తున్న సినిమా కావడం కూడా 'రెడ్'కి కమర్షియల్ గా ప్లస్ అయ్యే అంశమే.
![]() |
![]() |