![]() |
![]() |

మేజర్ సాహబ్, ఖాకీ, సత్యాగ్రహ లాంటి చిరస్మరణీయ చిత్రాల్లో కలిసి నటించిన అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గణ్ మరోసారి కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. ఏడేళ్ల తర్వాత ఆ ఇద్దరూ 'మేడే' అనే హ్యూమన్ డ్రామా చేయబోతున్నారు. ఈ మూవీలో అజయ్ దేవ్‌గణ్ ఒక పైలట్ క్యారెక్టర్‌ను చేయనున్నాడని తెలుస్తోంది. బిగ్ బి క్యారెక్టర్ ఏమిటనే దానిపై ప్రస్తుతానికి సమాచారం లేదు. మిగతా తారాగణం ఎంపిక జరుగుతోంది.
ఈ సినిమాను అజయ్ దేవ్‌గణ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తూ, స్వయంగా డైరెక్ట్ చేయనున్నాడు దేవ్‌గణ్. అమితాబ్‌ను డైరెక్ట్ చేయనుండటం ఆయనకు ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలవనున్నది. ఈలోగా 'భుజ్' షూటింగ్‌ను దేవ్‌గణ్ పూర్తిచేయనున్నాడు. మరోవైపు అమితాబ్ 'కేబీసీ' షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
'తానాజీ: ది అన్‌సింగ్ వారియర్'గా టైటిల్ రోల్ పోషించి, సూపర్ హిట్ సాధించిన అజయ్ దేవ్‌గణ్ 'మేడే'లో మరో స్పెల్‌బౌండ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.
![]() |
![]() |