![]() |
![]() |

'కేజీఎఫ్' స్టార్ యష్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. సంవత్సరాల తరబడి అపారమైన అంకితభావంతో ఎప్పుడూ అలసిపోకుండా పనిచేస్తూ, తనదైన ఇమేజ్‌ను, క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. తన చిన్నారి కుమారుడు యథర్వ్ తొలి పుట్టినరోజును అక్టోబర్ 30న యష్ మరచిపోలేని రీతిలో ఆహ్లాదకరంగా జరిపాడు.
ఈ కన్నడ సూపర్ స్టార్ ఈ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించాడు. చాలా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడని చాలా కొద్ది మందికి తెలుసు. ఇంతకుముందు కూతురు ఐరా బర్త్‌డేని కూడా గ్రాండ్‌గా జరిపిన యష్, ఇప్పుడు కొడుకు బర్త్‌డేని కూడా అలాగే జరిపాడు. చిన్నతనంలో పుట్టినరోజులకు తాను అనుభవించని ఆనందాన్ని తన పిల్లలకు అందించాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన దృష్టితో మొదట తాను తండ్రి, ఆ తర్వాతే నటుడు.
జీవిత కాలపు గుర్తుగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో ఆ బర్త్‌డే పార్టీకి సంబంధించిన మనసును హత్తుకొనే ఓ వీడియోను శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు యష్. అందులో యథర్వ్ బర్త్‌డే పార్టీని ఒక బోట్‌లో జరపడం కనిపిస్తుంది. "నీ బర్త్‌డే కేక్ ఫ్లేవర్‌ను నువ్వు మరచిపోవచ్చు, ఆ రోజు ఎందుకంత ప్రత్యేకమైందో నీకు తెలుస్తుంది. కానీ తల్లిదండ్రులుగా ఈ వేడుక మా జీవితాలను ఆనందమయం చేస్తుంది. ఈ చిన్నపాటి సంతోష కాలంలో పేరెంట్స్‌గా ఓ ఏడాది గడిచిపోయింది. హ్యాపీ బర్త్‌డే" అంటూ రాసుకొచ్చాడు. ఈ వేడుకలో భార్య రాధికా పండిట్, కూతురు ఐరా, సన్నిహిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



![]() |
![]() |