![]() |
![]() |

అనుష్క అలియాస్ స్వీటీ శెట్టి పక్కన ‘పంచాక్షరి’లో హీరోగా నటించిన సామ్రాట్ ఇటీవల రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాలో శ్రీలిఖితతో జరిగిన పెళ్లికి తక్కువమందిని మాత్రమే ఆహ్వానించారు. బహుశా... కరోనా కారణంగా ఎక్కుమందితో రిస్క్ అని భావించారేమో! అయితే... హైదరాబాద్ వచ్చిన కొత్త పెళ్లికొడుకు తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 టీమ్‌కి పార్టీ ఇచ్చాడు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలు చేసిన సామ్రాట్‌రెడ్డి... స్టార్‌మా ఛానల్‌లోని రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్2లో సందడి చేసిన సంగతి తెలిసిందే. షో ముగిసిన తర్వాత సీజన్2లో పార్టిసిపేట్ చేసిన సభ్యులందరూ ఓ గ్రూప్ పెట్టుకున్నారు. తరచూ కలుస్తుంటారు. పార్టీలు చేసుకుంటారు. ఈసారి సామ్రాట్‌రెడ్డి పెళ్లి పార్టీలో కలిశారు. దీనికి సింగర్ గీతా మాధురి ఒక్కరు మిస్ అయినట్టు దీప్తి నల్లమోతు ఇన్‌స్టా స్టోరీ చూస్తే తెలుస్తోంది. ఆల్రెడీ బిగ్‌బాస్ సీజన్2లో పార్టిసిపేట్ చేసిన హీరో తనీష్, దీప్తి సునయన పెళ్లికి వెళ్ళారు. పార్టీలోనూ సందడి చేశారు.




![]() |
![]() |