![]() |
![]() |

పాపం... మలయాళీ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్‌ని అదృష్టం వరించిందని అనుకునేలోపే దురదృష్టం వెక్కిరించిందని ఫిల్మ్‌నగర్ గుసగుస. నట సింహం నందమూరి బాలకృష్ణతో నటించే అవకాశం అందినట్టే అంది ఆమెకు దూరమైంది. బాలయ్య పక్కన ఆమె బాలేదనీ, మరీ చిన్నపిల్లలా ఉందనీ సినిమా నుంచి తీసేశారని టాక్. అసలు వివరాల్లోకి వెళితే...
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను ముచ్చటగా మూడో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా ప్రయాగ మార్టిన్‌ని తీసుకున్నారు. ఒక రోజు షూటింగ్ కూడా చేశారు. అయితే... బాలయ్య పక్కన జోడీగా ఆమె బాలేదని తీసేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె స్థానంలో వీలైనంత త్వరగా మరొకరిని ఎంపిక చేయాలని యూనిట్ ట్రై చేస్తోంది.
బాలకృష్ణ సరసన నటించడానికి స్టార్ హీరోయిన్లు రెడీ. కానీ, ఎక్కువ రెమ్యూనరేషన్ కాకుండా తక్కువలో వచ్చే హీరోయిన్ల కోసం బోయపాటి శ్రీను చూస్తున్నార్ట. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా పూర్ణను ఓకే చేశారు. త్వరలో మెయిన్ హీరోయిన్‌ని సెలక్ట్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేస్తార్ట.
![]() |
![]() |