![]() |
![]() |

రీ-ఎంట్రీలో యమ జోరు మీదున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇంకా చెప్పాలంటే.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించేందుకు సిద్ధమయ్యారాయన. కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ళ కాలంలో పంచచిత్ర ప్రణాళికతో వినోదం పంచనున్నారు పవన్. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తన చేతిలో ఉన్న ఈ ఐదు సినిమాల్లో నాలుగు చిత్రాలు డైరెక్టర్స్ పరంగా ఫ్రెష్ కాంబినేషన్‌వే కావడం విశేషం.
కోర్ట్ డ్రామాగా రూపొందుతున్న 'వకీల్ సాబ్'కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. పిరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న 'విరూపాక్ష' (వర్కింగ్ టైటిల్)కి క్రిష్ డైరెక్టర్. ఈ ఇద్దరూ కూడా పవన్ కాంబినేషన్‌లో ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తరువాత పవన్ ఒప్పుకున్న చిత్రం మాత్రం 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో రానుంది. ఆపై అంగీకరించిన సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ, సాగర్ చంద్ర డైరెక్టోరియల్.. కూడా ఆయా దర్శకులతో పవన్‌కి తొలి కాంబినేషన్‌లే.
మరి.. ఫ్రెష్ కాంబినేషన్స్‌తో పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.
![]() |
![]() |